Saturday 4 June 2011

మన జీవనం

నిన్నటి జ్ఞాపకాల కలలో లీనమైతే
రేపటి దిక్కుగా నీ ప్రస్థానం సాగదుగా

అపజయాలెన్నో అడియాసలు రేపినా
నడిచే జీవితం అడుగైనా ఆగదుగా

పుట్టే పొద్దుకు కన్నులు స్వాగత పత్రాలని
చీకటి వెన్నెలలో కలలు కనటం మానుతామా

సృష్టి నాడిలో అనుక్షణం చావు చప్పుడున్నదని
తల్లి బిడ్డకి జన్మనివ్వటం ఆపుతుందా

పెను తుఫానుల అలలను తిప్పికోట్టినప్పుడే
నేల తల్లి తీరం స్థిరంగా నిలిచేది

గొంతు ముగాపోయిందని భావాలు ముతపడవు
నరాల రెక్కలతో విహంగ విన్యాసం చేస్తాయి

నీ ప్రాణానికి కదలిక ఆగిపోయిందని
ఉదయించిన నీ ఆశాజ్యోతులు ఉరకలేయ్యటం ఆపుతాయా

ఆశల తెరల మధ్య నిరాశల పొరల మధ్య
సాగే సుఖదుఖాల తరంగాలే మన జీవన ప్రవాహం

ప్రస్థానంకి ఎప్పుడు ముందు చూపే,
జ్ఞాపకానికి మాత్రం వెనక
తల్లి కడుపులోకి మళ్ళీ పోలేంగా
కానీ ఆ పేగు బంధం ఈ పెగుతో పెనవేసుకుని పోతుంది
విశ్వ యవనికతో భూమి శృతి కలిపినట్లు

No comments:

Post a Comment