Tuesday 30 August 2011

తెలంగాణకు విలన్ నెం.1 రోశయ్యే..!!

చూడటానికి పెద్దమనిషిలా.. గౌరవంగా కనిపించే మాజీ సీఎం రోశయ్య నంగనాచిలా తెలంగాణకు వ్యతిరేకంగా చేయాల్సిందిల్లా చేశాడు. డిసెంబర్ 9 ప్రకటనను నిలిపివేస్తూ డిసెంబర్ 23 ప్రకటన రావడానికి ప్రధాన కారకుడు రోశయ్యే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఈ నంగనాచి రోశయ్య పంపిన దొంగ నివేదికనే కారణం. దారిన పోయే దానయ్యనంటూనే తెరవెనక కథంతా నడిపించాడు. సీమాంధ్రలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందంటూ 2009 డిసెంబర్ 19, 20 తేదీల్లో కేంద్రానికి పచ్చి అబద్దపు నివేదికలను పంపాడు. అందులో ప్రతీ లైనులో అబద్దపు మాటలే. 86 వేల మంది సీమాంధ్రులు ఆందోళనలో పాల్గొన్నారని, తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర మొత్తం తగలబడి పోతుందని అతి దారుణంగా, మోసపూరితమైన నివేదికను కేంద్రానికి చేరవేశాడు. నివేదికను ఇవ్వడానికి స్వయంగా తానే ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీ విమానాశ్రయంలో పెద్ద డ్రామానే నడిపాడు. ఇక అంతా అయిపోయిందని, సీమాంధ్రలో పరిస్థితి అదుపుతప్పిందని, వెంటనే డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని సినిమాల్లో విలన్ కన్నా అత్యంత దారుణంగా నటించి, నర్తించాడు. ఇన్నాళ్లూ చంద్రబాబు కుట్ర అని అందరూ అనుకున్నారు. కానీ రోశయ్య కుట్రలో చంద్రబాబు భాగస్వామి అని ఆలస్యంగా తెలిసింది. రోశయ్య రాసిన నివేదికలను ఆర్‌టీఐ యాక్టు ద్వారా టిన్యూస్ సంపాదించింది. లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులు కూడా ఈ కుట్రలో ప్రధాన భూమిక పోషించారు. రోశయ్య పంపిన నివేదికలో లగడపాటి దీక్షను కూడా పెద్ద బూచిలా చూపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి ప్రారంభమైన రాజీనామాల పర్వం ఈ ముసలి, మాజీ సిఎం పన్నిన పన్నాగమని ఇప్పుడే బయట పడింది. డిసెంబర్ 23 ప్రకటనకు ప్రధాన కారకుడనే పచ్చి నిజం నిగ్గుతేలింది. ఇంత పెద్ద డ్రామాను ఎంతో చాకచక్యంగా నడిపిన రోశయ్యకు సీమాంధ్ర పెత్తందార్లు కేంద్రం చేత ఇప్పించిన నజరానానే తమిళనాడు గవర్నర్‌గిరి.

ఆపదర్మ ముఖ్యమంత్రి అయ్యినవాడు 10 కోట్ల ప్రజలకు న్యాయం చేయాలి అల కాకుండా సీమ ఆంద్ర నీచ బుడ్డి తో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండు ఇచిన తెలంగాణాను వెనకకు పోవడానికి కారణం ఈ ముసలోడే ఇంతకముందు మాట ఇచి మోసం చేసినోళ్ళు ఎలా చాచారో చూసాం వీడు కూడా అంతే 600 మంది అమరుల ఆత్మలకు శాంతి లేకుండా చేసాడు వీడు సామాన్యుడు కాదు టీ న్యూస్ పుణ్యమా అని అందరికి ఈ సీమ ఆంద్ర రాజకేయ నాయకుల గురించి తెలిసింది ఇప్పటికిన అర్ధమయిందా మన చానెల్ మన పేపర్ మనకోసమే మన ఆత్మ గౌరవం నీలబదాలంటే మనం వాటిని అదరిన్చలుఇ దన్యవాదములు టీ న్యూస్ మరియు నమస్తే తెలంగాణ.

No comments:

Post a Comment