Friday 30 December 2011

ఏ ప్రస్థానం వైపు నా అడుగులు... !!




మనిషి చురకు జీవితంలోని సగం
నేటితో నాకు అది గతం...!!

పాతికేండ్ల గతాన్ని
సురంలా మింగితే
భవిష్యత్తు అంతా
నిషా నిజం...!!




చెట్లు కదిలితే ఎంత వినాశకరమో
అట్లా చీకట్లు నడుస్తున్నాయి
నేటి యాంత్రిక ప్రపంచంలో...
పుట్టుకతోనే వ్రుద్ధులైనట్లు
అంతా నిద్ర పోతున్నారు నీడల్లో
కాల రాక్షసి అడుగుజాడల్లో.... !! 

చుట్టూ కలుముకున్న
నిషా పరదాని
లేపి లేపి
తూర్పు గట్టు నుండి
చీకటింటి తలుపుతోసి
పిలుస్తోంది 
పొడుస్తున్న పొద్దు...!!

ఆ ఉదయం సవ్వడి వింటే చాలు
రాయి కూడా ఒళ్ళు విరుచుకుంటుంది
అలా పుట్టుకొచ్చే పొద్దుకు నా నేత్రాలు
స్వాగత పత్రాలయ్యాయి

ఒక్కొక్క కిరణావళి 
స్ప్రుశిస్థూ ఉంటే
నా ప్రాణాలు బావుటాలై
రెపరెపలాడుతున్నాయి

ఆ సూర్యోదయమే
బ్రతికున్న శవంలా పడి ఉన్న నన్ను
కరిగించింది కదిలించింది
కాలానికి ఆశ్వగతులు నేర్పుతూ...!!

నాలో మొలిచింది ఒక బీజం
నిరంతర వికాస వృద్ధి కోసం
నేను వృద్ధున్ని కాదు 
రాబోయే యుగానికి కాబోయే దూతవి
కావాలంటూ వేయించింది
రేపటి ప్రస్థానం వైపు నా అడుగులు....!!
----------------------------------


-- నిశాంత్ దొంగరి

Monday 26 December 2011

‎"చంద్ర దండు" దండయాత్ర

ఎవడు వీడు..అహా
ఎక్కడి వాడు..అర్రే
మోసగాడు..ఘాటు కొడుకు
మన నోటికాడి కూడు లాగినోడు
మళ్ళీ మనల్ని ముంచ బయలెల్లినాడు
ఇటు వస్తున్న "చంద్రదండు"

తుర్ర్రర్రర్...

అర్రే ఎల్లన్న..మల్లన్న
తెలంగాణ రాజన్న...
జాతర పోదమా..డీన్ బాయిలో
వీన్ని పాతర పెడదామా....డీన్ బాయిలో

వీడు దింపుడు గల్లం ఆశలతోటి
వత్తాండు..డీన్ బాయిలో
వీనికి ఘోరి మనం కట్టాలి..డీన్ బాయిలో

తెలంగాణ తనువు నిండ..
ఫ్యాక్టరీల సిరుల కొండ
తరుగ దీసి కరుగ బోసి
కాయలబడెటట్లు చేసి
ఖార్ఖానాలు ప్లాట్లు జేసి
పెత్తందార్లకు కమ్మగ కొమ్ము కాసి
కోట్ల కోట్లు బుక్కినాడు..

ప్రభుత్వ రంగాన్ని
పాతర బెట్టిండు వీడు..ఓర్ర్ రాజన్న
అమెరకోని పల్లకి మోసిండు..ఓర్ర్ రాజన్న
ఆధునిక ఆలయాల
హారతులే ఆర్పిండు వీడు..ఓర్ర్ రాజన్న

పలుగు పడదమా...డీన్ బాయిలో
వీని పాడె కడదామా..డీన్ బాయిలో
సమ్మెట పడదమా..డీన్ బాయిలో
వీని సంగతి చుద్దమా..డీన్ బాయిలో
జాతర పోదమా..డీన్ బాయిలో
వీన్ని పాతర పెడదామా..డీన్ బాయిలో

రాష్ట్రానికి CEO నన్నాడు వీడు..ఓర్ర్ రాజన్న
మనుషుల్ని వస్తువు లెక్క చూసిండు..ఓర్ర్ రాజన్న
రైతుల గుండెల్లోకి గుండ్లు దింపిండు..ఓర్ర్ రాజన్న
వీడు ఆట మాట పాట బందు పెట్టిండు..ఓర్ర్ రాజన్న

గుత్తుప పడుదమా..డీన్ బాయిలో
వీని గుండెల తందమా..డీన్ బాయిలో
కత్తులు పడదామా..డీన్ బాయిలో
వాని కండ్ల నెత్తురు చూద్దమా..డీన్ బాయిలో

ISB లోను కింద వరల్డు బ్యాంకు ఖాత కింద..ఓర్ర్ రాజన్న
వీడు తెలంగాణ తల్లి తాళిబొట్టు తాకట్టు పెట్టిండు..ఓర్ర్ రాజన్న
తెలంగాణ ఫ్యాక్టరీలను బాయిలేసి బొంద పెట్టిండు..ఓర్ర్ రాజన్న
నా రత్నాల తెలంగాణను రావణ కాష్టం చేసిండు..ఓర్ర్ రాజన్న

తరిమి కొడదామా..డీన్ బాయిలో
వీన్ని తగుల పెడదమా..డీన్ బాయిలో
గొడ్డలి పడదమా..డీన్ బాయిలో
వీని ఘోరి కడదమా..డీన్ బాయిలో

తెలంగాణ జెండా పడదమా..ఓర్ర్ మల్లన్న
ఆత్మగౌరవ పతాకం ఎగరేద్దమా..ఓర్ర్ ఎల్లన్న

జాతర పోదమా..ఓర్ర్ రాజన్న
వీన్ని పాతర పెడదామా..ఓర్ర్ రాజన్న
జాతర పోదమా..ఓర్ర్ రాజన్న
వీన్ని పాతర పెడదామా..ఓర్ర్ రాజన్న

Friday 23 December 2011

‎Poem Questioning the Disheartened Poet...!!

‎"గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో ? -- ఆ కవిని కవనాలు ప్రశ్నిస్తున్న వేళ"

మన తనువులు
ఒకరికొకరం..
కేవలం పేర్లమేనా
పదాలమేనా
ధ్వని మాత్రమేనా

లేక
భూత భవిష్యత్తులకు నోచుకోని
వర్తమానమేనా...
సంయోగం సంభవం కాని
ఏకాంతతత్వమా

నీ భాషలో కానీ, నా భాషలో కానీ
ఏ భాషలో కానీ
విడమరచి చెప్పలేని
వాక్యంగా రుపుదిద్దుకోజాలని
పదాలమా ?

ప్రాణం ఉన్నా
రూపానికి నోచుకోని
ఆత్మలమా ?